చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు
ఆడ, మగ అంటూ గర్భస్థ లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తే అనుమతులు రద్దు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భ్రూణ హత్యలు నేరం, రుజువైతే కఠిన చర్యలు తప్పవు జిల్లా జడ్జి పాటిల్ వసంత్
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఆగస్టు.21; జిల్లా వైద్య ఆరోగ్య శాఖ;
భ్రూణ హత్యలు నేరమని, రుజువైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా జడ్జి వసంత్ పాటిల్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లా బహుళ సభ్య అధికార కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి వసంత్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చించారు .ఆడపిల్లని ఎదగనియాలని, ఆడ, మగ అంటూ గర్భస్థ లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తే (పిసి పిఎన్డిటి) యాక్ట్ ప్రకారం ఆయా ఆసుపత్రుల అనుమతులు రద్దు
చేయాలని సూచించారు. ఆడపిల్లలపై జరుగుతున్న దాడులను నిరో దించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారులు ప్రయివేట్ ఆసుపత్రులను నిరంతరం పర్యవేక్షణ చేయాలని, గర్భవిచ్చిన ఆపరేషన్లు చేసే వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎల్. భాస్కర్ నాయక్ , పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్, ప్రోగ్రాం అధికారులు డా. చైతన్య,డా. బాలాజీ, డిప్యూటీ డెమో ఫైజ్ మొహిఉద్దీన్, డీసీపీఓ ఎం.కుమారి తదితరులు ఉన్నారు.