మహిళ దారుణ హత్య

Oct 21, 2025 - 19:17
Oct 21, 2025 - 19:29
 0  3
మహిళ దారుణ హత్య

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : మహిళ దారుణ హత్య ఏపూర్ గ్రామం నడిబొడ్డు లో జరిగిన సంఘటన.. ఆత్మకూరు ఎస్.. ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ గ్రామంలో పట్ట పగలు వీధిలో వెళుతున్న మహిళ ను కారు తో డీ కొట్టి కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొరివి బిక్షమమ్మ 40.తన భర్త కొరివి మల్లయ్య తో ఉన్న తగాదాను పెద్దల సమక్షంలో మాట్లాడి వస్తుండగా గ్రామం నడిబొడ్డున గుర్తు తెలియని వ్యక్తులువీధిలో నడిచి వస్తున్న బిక్షమమ్మ ను వెనుక నుండి కారుతో ఢీ కొట్టి కిందపడిన మహిళను దుండగులు కారు నుండి దిగి తన వెంట తెచ్చుకున్న కత్తితో భిక్షమమ్మ గొంతుపై దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ సంఘటనతో బిక్షమమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు భిక్షమమ్మ కు తన భర్త కొరివి మల్లయ్యకు గత కొంతకాలంగా గొడవలు కొన సాగుతున్నాయి. మృతురాలి భర్త మల్లయ్య లారీ డ్రైవర్ గా పనిచేస్తుండగా వారికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు భరత్ హైదరాబాదులో మెకానిక్ గా పని చేస్తుండగా చిన్న కుమారుడు ప్రవీన్ సూర్యాపేట లోచికెన్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. మృతరాలు బిక్షమమ్మ ఇతరులతో అక్రమ సంబంధం ఉన్నదని భర్త మల్లయ్య కుటుంబ సభ్యులు తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలతో గొడవ పడుతుండేవారు. ఈ విషయమై పెద్దలు పలుమార్లు పంచాయతీ లు చేసి సర్ది చెప్పినట్లు తెలిసింది. ఇటీవల సూర్యాపేటకు చెందిన ఒక దేశ గురువు మృతురాలు భిక్షమమ్మ తో చనువుగా ఉండడం కుటుంబ సభ్యులు దేశ గురువుతో పాటు భిక్షమమ్మ ను మందలించారు. తీరు మార్చుకొని భిక్షమమ్మ ను మంగళవారం తన భర్త మల్లయ్య పెద్దల సమక్షంలో మందలించేందుకు స్థానిక ఒక పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. పెద్దలు ఇరువురిని సముదాయించి పంపించిన కొద్దిసేపటికే బిక్షమమ్మ ఆ పార్టీ కార్యాలయ సమీపంలో దారుణ హత్యకు గురైంది.సమాచారం తెలుసుకున్న సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్ సీఐ రాజశేఖర్ ఎస్ శ్రీకాంత్ గౌడ్, తో క్లూజ్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. శవాన్ని సూర్యాపేట హాస్పిటల్ కు తరలించారు.భిక్షమమ్మ హత్యకు దారి తీసిన కారణాలను పోలీసులు విచాతీస్తున్నారు.