సాదా సీదా నాయకుడిగా ఎమ్మెల్యే మందుల సామెల్

Oct 21, 2025 - 19:44
Oct 21, 2025 - 19:45
 0  4
సాదా సీదా నాయకుడిగా ఎమ్మెల్యే మందుల సామెల్

ఎమ్మెల్యే మందుల సామేలు అంటే సాదాసీదా నాయకుడు... 

 ప్రజలతో ఇట్లనే మమేకమవుతారు

మరోసారి ప్రజల నాయకుడిగా నిరూపించుకున్నా ఎమ్మెల్యే

తిరుమలగిరి 22 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ : పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళుతూ మధ్యలో తిరుమలగిరి చౌరస్తాలో టీ తాగుతూ సందడి చేశారు. ఉద్యమ కాలంలో టీ తాగిన సంఘటన గుర్తు చేసుకుంటూ మాట్లాడుకున్నారు ఎమ్మెల్యే మందుల సామెల్ అంటే సదా సీదా నాయకుడు అనే పేరుంది.ఎక్కడ ఎలాంటి పర్యటనకు వెళ్లి ఆయన అక్కడి ప్రజల్లో మమేకం అయిపోతారు. వరసలు పెట్టి అందరితో కలుపుగోలుగా మాట్లాడుతారు. ఆయన ఎంత సింపుల్‌ నాయకుడు మరోసారి నిరూపించుకున్నారు. ప్రజల్లో ఉండే నాయకుడు సామాన్య నాయకుడు అని తిరుమలగిరి చౌరస్తా లో మరో సారి నిదర్శనంగా చూపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఆయన జగదాంబ టీ స్టాల్ వద్దకు వెళ్లారు.ఒక సామాన్యునిగా తిరుమలగిరి చౌరస్తాలో చాయ్ తాగి ముచ్చటించారు. తిరుమలగిరి లో ఈ చాయ్ ఫెమస్ అంట కదా అంటూ...! టీస్టాల్ యజమానితో మాటలు కలిపారు. నీ దగ్గర చాయ్ బాగుంటుందట.. !! చాయ్ తాగుతూ.. చాయ్ కొట్టు అతనితో ఆత్మీయంగా మాట్లాడారు. ఏదీ ఓ చాయ్ పోయ్ చూద్దామన్నారు. దీంతో ఎమ్మెల్యే టీ కొట్టుకు వద్దకు రాగానే అక్కడ ఉన్నవారంతా భారీగా చేరుకున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. దీంతో ఎమ్మెల్యే అందరిని పలకరించారు. టీ స్టాల్ వద్ద చాయ్ తాగి మరో సారి సదా సీదా నాయకునిగా , ప్రజల్లో ఉండే నాయకుడు అని నిరూపించుకున్నారు . వారి వెంట మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్ సుంకరి జనార్దన్ జుమ్మిలాల్ కందుకూరి లక్ష్మయ్య నరసయ్య కృష్ణ నాయక్ కార్యకర్తలు అభిమానులు ఉన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి