ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విధులు నిర్వర్తించాలి:ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు

Dec 13, 2024 - 18:19
 0  4
ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విధులు నిర్వర్తించాలి:ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు
ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విధులు నిర్వర్తించాలి:ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు
ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విధులు నిర్వర్తించాలి:ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు

జోగులాంబ గద్వాల 13 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ధరూరు ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విధులు నిర్వర్తిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని, సైబర్ నేరాలు, మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలపై గ్రామ పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు  అన్నారు.శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ధరూర్   మండల పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ సందర్శించి స్టేషన్ రికార్డులు, స్టేషన్ పరిసరాలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్.హెచ్.వో, లాక్ అప్, మెన్ రెస్ట్ రూం తదితర ప్రదేశాలను పరిశీలించారు. స్టేషన్ లో రోజువారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ, సెంట్రీ రిలీఫ్ బుక్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, సుపీరియర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్, ఫైనల్ రిపోర్ట్స్ తదితర రికార్డులను ఆయన తనిఖీ చేశారు.గ్రామాల్లో మోనిటర్ కమిటీ ఆధ్వర్యంలో నిషేధిత గంజాయి, గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.అదేవిధంగా పోలీసు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..ప్రజలతో మరియు పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో  మర్యాదపూర్వకంగా మాట్లాడాలని ఫిర్యాదుదారులందరికీ ఒకే రకమైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జిల్లా పరిధిలోనే ఉండి విధులు నిర్వహించాలని, సమయం దొరికినప్పుడు ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ప్రతిరోజు పోలీసు అధికారులు సిబ్బంది సమయం దొరికినప్పుడు వ్యాయామం, యోగ, ధ్యానం, వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి అడిగి తెలుసుకున్నారు, గత మూడు సంవత్సరాల నుండి నమోదవుతున్న కేసుల గురించి కంపారిటివ్ స్టేట్మెంట్ ను పరిశీలించి, మరియు అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను,  గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. రౌడీలు, కేడీలు, సస్పెక్ట్స్ మరియు సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి, వారి కదలికలను గమనించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. విధినిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ  ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు,  సిసీటిఎన్ఎస్ ప్రతి ఫైల్ ను ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ చేసుకోవాలని సిబ్బందికి సూచించారు.ప్రతి ఒక్కరూ నీట్ టర్న్ అవుట్ కలిగి ఉండి, మంచి క్రమశిక్షణ సమయపాలన పాటించాలని లీడర్షిప్ లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లో ప్రజల కోసం పోలీసులు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.గాంజా అక్రమంగా రవాణా చేసినా.. సేవించినా చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకుంటామన్నారు. యువత చదువుపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని ఎస్సై నీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డి .ఎస్పి సత్యనారాయణ,గద్వాల్   సీఐ టి.శ్రీనివాస్, ఎస్సై అబ్దుల్ షుకూర్,  సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333