నిరుద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి

Nov 7, 2024 - 18:32
 0  45
నిరుద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా  ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి
నిరుద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా  ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి

Jagtial District Korutla నిరుద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి (ఆల్ఫోర్స్) అన్నారు. కోరుట్ల పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన ఎమ్మెల్సీ ఓటరు నమోదు గతంలో కంటే ఎక్కువగా నమోదు అయినట్లు తెలిపారు. గతంలో 01 లక్షా 97 వేలు ఉంటే ఇప్పుడు 03 లక్షల 50 వేలకు పెరిగాయని అన్నారు. ఓటరు నమోదుకు కృషి చేసిన అధికారులకు, పట్టభద్రులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల ఓటరు నమోదు గడువు పొడిగించాలని ఎన్నికల కమిషన్ ను కోరినప్పటికీ గడువు పెంచలేదని తెలిపారు. ఇంకా ఓటరు నమోదు చేసుకోని పట్టభద్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నవంబర్ 23 నుండి మరో విడతలో ఓటరు నమోదుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీగా ఆశీర్వదించి గెలిపిస్తే నిరుద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ అమలు అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల సంక్షేమానికై కృషి చేస్తానని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్ మెంట్ రాక నానా అగచాట్లు పడుతున్నారని, సత్వరమే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రతీ 03 నెలలకు ఒకసారి రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తానని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రతకై కృషి చేస్తానాని అన్నారు. రెగ్యులర్ ఎంప్లాయిస్ కు పెండింగ్ లో ఉన్న డీఏ విడుదల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి, డీఏ విడుదల అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న ఒకేషనల్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న (హెచ్ బిటీ) ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇప్పిస్తానని అన్నారు. ప్రైవేటు టీచర్లకు కనీస వేతనాలు అందేలా చూస్తామని పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333