ఖమ్మం జిల్లా ఆర్య సంఘం అధ్యక్షులు ఏకగ్రీవం"పసుమర్తి చందర్రావు
తెలంగాణ వార్త పాలేరు ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఖమ్మం జిల్లా ఆర్య సంఘం అధ్యక్షులుగా ఖమ్మం నగర గుట్టల బజార్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఈరోజు నామినేషన్ ప్రక్రియ జరిగినది సింగిల్ నామినేషన్ పసుమర్తి చందర్రావు గారు కల్లూరు ఏకగ్రీవము ఎన్నికల ఆఫీసర్ దోసపాటి వెంకటేశ్వరరావు గారు పసుమర్తి చందర్ రావు గారిని ప్రకటించారు ఏకగ్రీవం అనంతరం నేలకొండపల్లి మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ పట్టణ అధ్యక్షులు రే గూరి హనుమంతరావు మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగ బండి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా జగన్మోహన్రావు మాజీ మండల అధ్యక్షులు కొత్త రమేష్ మండల సెక్రటరీ యర్రా నాగేశ్వరరావు పట్టణ సెక్రటరీ కొత్త వేణుబాబు కార్యవర్గ సభ్యులు మాటూరి సుబ్రహ్మణ్యం, ఎండూరి బ్రహ్మం , కొప్పు కృష్ణమూర్తి, గరినే వెంకటేశ్వర్లు అధ్యక్షులు వసుమతి చందర్రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసి చిరు సత్కారం చేయటం జరిగినది అధ్యక్షుల వారు మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు మన జిల్లా లాగానే ఎలాంటి గొడవలకి తావివ్వకుండా వైశ్యులు ఐక్యత సాటుతూ రాష్ట్రమంతటా ఏకగ్రీవం కావాలి అని కోరుకున్నారు తన వంతు కృషిగా అందరికీ న్యాయం చేస్తానని ప్రతి ఆర్యవైశ్యని కలుపుకొని పోతానని కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని ఏ సమస్య వచ్చినా మీ వెనక నిలబడి పోరాటం చేస్తానని తెలియజేశారు