వికలాంగుల మహాసభలను జయప్రదం చేయండి

 మహాసభల కరపత్రం విడుదల చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం

Jul 20, 2024 - 13:47
Jul 20, 2024 - 13:47
 0  10
వికలాంగుల మహాసభలను జయప్రదం చేయండి
వికలాంగుల మహాసభలను జయప్రదం చేయండి

రామన్నపేట 20 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- జూలై 30వ తేదీన రామన్నపేట మండల కేంద్రంలో జరిగే వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పిఆర్ డి జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆహ్వానం పత్రిక ఇచ్చి సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికలాంగులను చైతన్య పరచడంలో ఎన్.పి.ఆర్.డి సంఘం చేస్తున్న కృషికి అభినందనీయమని వారు అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రజా ప్రభుత్వంలో వికలాంగులకు ఉన్నత విద్యలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు జీవోను విడుదల చేయడం జరిగిందని వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్రంలోని వికలాంగులు అతి త్వరలో శుభవార్త వినబోతున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సురుపంగ ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ..ఈనెల 30 న రామన్నపేట పట్టణంలోని జేపీ ఫంక్షన్ హాల్ జరిగే జిల్లా మూడవ మహాసభల జయప్రదం కోసం జిల్లాలోని వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ 300 నుంచి 3000 రూపాయలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా వికలాంగుల పెన్షన్ 6000 పెంచాలని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మహాసభలలో జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షులు బల్గూరి అంజయ్య,రామన్నపేట మాజీ ఎంపీపీ పూస బాలనరసింహ,ఎం నరేష్ తదితరులు పాల్గొన్నారు.