డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం లో సమీక్ష సమావేశం

Nov 7, 2024 - 17:05
 0  40
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్

జోగులాంబ గద్వాల 7 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-గద్వాల జిల్లా కేంద్రంలోని తేదీ.07.11.2024 న డాక్టర్ బి. రవీందర్ నాయక్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం (IDOC- F 30 block) గద్వాల లో జిల్లా వైద్య అధికారులతో మరియు వైద్య సిబ్బందితో సమావేశమై వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు , ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్. ఎస్కే. సిద్ధప్ప  మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, డైరెక్టర్ ని ఘనంగా సన్మానించారు....
డైరెక్టర్   జాతీయ మరియు రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాలు అయినటువంటి , మాత శిశు సంరక్షణ కార్యక్రమం, జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, జాతీయ టిబి, కుష్టు  వ్యాధుల కార్యక్రమాలు, అసాంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమము, మరియు PCPNDT Act -1994, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ -2010 మొదలగు కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు...
ఈ సమీక్షా సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్.J. సంధ్యా కిరణ్ మై, డాక్టర్.కే. నవీన్ కుమార్ రెడ్డి, డాక్టర్ రిజ్వానా తన్వీర్, డాక్టర్ . ప్రసూన రాణి, డాక్టర్ జి. రాజు  మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333