ఆదివాసీ జూనియర్ విద్యార్థులకి వసతి గృహం ఏర్పాటు చెయ్యాలి
గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కి వినతి పత్రం
ఆగస్టు 31 వెంకటాపురం తెలంగాణ వార్త:- వెంకటాపురం మండలంలో నూతనంగా మంజూరైన జూనియర్ కళాశాలలో చదువుతున్న ఆదివాసి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని గొండ్వాన సంక్షేమ పరిషత్ తెలుగు ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సోంది వీరయ్య డిమాండ్ చేశారు.వెంకటాపురం మండల తాసిల్దార్ లక్ష్మి రాజయ్యకి గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.శనివారం నాడు వెంకటాపురం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిఎస్పి రాష్ట్ర కన్వీనర్ సోంది వీరయ్య మాట్లాడుతూ. నూగూరు వెంకటాపురం తాలూకా ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతమని, బ్రిటీష్ పాలన జరిగిన సమయంలో ఆదివాసులు బ్రిటీష్ ప్రభుత్వం యుద్ధం జరిగాయని అలాంటి యుద్దలో ఆదివాసులు విజయం సాధించిన విషయం ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.అలాంటి చరిత్ర కలిగిన నూగూరు వెంకటాపురం మండల కేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ని రోజులు రాకపోవడానికి అగ్రవర్ణాల రాజకీయ పార్టీ నాయకులదని ఆయన తెలియజేశారు.నేటి మా ఆదివాసి సంఘాల ఉద్యమ పోరాట ఫలితంగానే జూనియర్ కళాశాల వచ్చిందని ఆయన గుర్తుచేశారు.అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు.అలాగే వెంకటాపురం మండల కేంద్రంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు వసతి గృహం సౌకర్యం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, పాతదే అయిన దృఢంగా ఉన్న సబ్ జైలు భవనాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలకి తాత్కాలికంగా విద్యార్థుల వసతి గృహంగా నియమించాలని, తాసిల్దార్ లక్ష్మి రాజయ్య వినతి పత్రం సమర్పించి ప్రభుత్వ దృష్టికి చేరాల చూడాలని కోరారు.అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి విద్యార్థులు చదువు వైపు అడుగులు వేస్తున్నారని,అన్ని రంగంలో ఆదివాసులు అభివృద్ధి చెందుతుంటే ఈ భూర్జవ రాజకీయ పార్టీల జండాలు మోస్తూ,ఆదివాసి విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని అన్నారు. ఆదివాసి యువత మేల్కొని చదువు వైపు తమ దృష్టిని సాధించాలని పూజ వ రాజకీయ పార్టీలను దూరంగా ఉంచి అభివృద్ధి మార్గం వైపు వెళ్లాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఈ సమస్యపై వెంటనే స్పందించి ఆదివాసి పేద విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని కోరారు.అలాగే వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన మొడెం వంశీ అంతర్జాతీయ బరువుల పోటీలో విజేత నిలిచిన వంశీకి, గొండ్వాన సంక్షేమ పరిషత్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే ఆదివాసి చట్టాలు హక్కుల పరిరక్షణకై ఉద్యమించే సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్క ఆదివాసి విద్యార్థులు ఉద్యమించి మన ఏజెన్సీ చట్టాలు కాపాడుకునే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు .ఈ సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, ములుగు జిల్లా అధ్యక్షులు రేగ గణేష్ ఉన్నారు