రైతు బంధు దళిత బంధు లెక్క కూలి బందు ప్రవేశపెట్టాలి

జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు  కడెం లింగయ్య

Jul 14, 2024 - 21:41
Jul 14, 2024 - 22:26
 0  22
రైతు బంధు దళిత బంధు లెక్క కూలి బందు ప్రవేశపెట్టాలి

తిరుమలగిరి 14 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఆదివారం రోజు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో మహిళ కూలీలందరినీ ఒకచోట చేర్చి కూలీలతో మాట్లాడుతున్న.. జీఎంపీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య తిరుమలగిరి మున్సిపల్ ఏర్పడడం వల్ల సుమారు 4 వేల మంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కోల్పోవడం జరిగింది. మున్సిపల్ ఏర్పడి ఉపాధి హామీ బందు చేయడం వల్ల అనేక మంది కూలీలు వివిధ గ్రామాలకు ఆటోలపై ట్రాక్టర్ల మీద 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి కూలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

 జిఎంపిఎస్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తి రైతుకు రైతుబంధు రుణమాఫీ బీమా పథకం పంట రుణమాఫీ లాంటి ప్రభుత్వం రైతులకు అనేక వసులుబాటు కల్పిస్తా ఉంది కానీ కూలీలకు కనీస రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది రోజువారి కూలీలందరికీ ప్రభుత్వం ఉపాధి హామీ పని తక్షణమే ప్రవేశపెట్టి తద్వారా పని కల్పించాలని ప్రభుత్వం కూలీలందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా మెడికల్ ఇన్సూరెన్స్ అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు కూలీలకు ఇవ్వాలని కోరుచున్నాము ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మున్సిపల్ కేంద్రాలలో తక్షణమే గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పనిని తక్షణమే ప్రవేశపెట్టాలని చెప్పి మేము కోరుచున్నాము నిత్యవసర వస్తు ధరలు నిరంతరం పెరుగుతా ఉన్నాయి కూలీలకు మాత్రము కూలి పెరగటం లేదు.. ప్రభుత్వం ఈ ధరలకు అనుగుణంగా రోజు కూలి కనీస వేతనం స్త్రీలకు 800 ప్రభుత్వం కూలీలకు ప్రవేశపెట్టాలని చెప్పి మేము కోరుచున్నాము

 ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి మున్సిపల్ కేంద్రాలలో కూలీల సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కూలీల ఆగ్రహానికి ప్రభుత్వం జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య చెప్పారు ఈ కార్యక్రమంలో లింగమ్మ కడెం, లక్ష్మి, శోభ, ఎల్లమ్మ, సంధ్య, లక్ష్మి,స్వప్న, తదితరులు పాల్గొన్నారు.