స్కూళ్లకు సెలవు పై కలెక్టర్లదే నిర్ణయం 

Aug 31, 2024 - 20:51
Aug 31, 2024 - 20:51
 0  7
స్కూళ్లకు సెలవు పై కలెక్టర్లదే నిర్ణయం 

వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 
ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చే విషయంలో ఆయా జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. డ్యాములు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద వరద తీవ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. జిల్లాల్లో వర్షం పరిస్థితిని ఎప్పటికప్పుడు సచివాలయానికి అప్డేట్ చేయాలని ఆదేశించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333