ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తత్రంగా తీసుకెళ్లాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి
కూకట్ పల్లి తెలంగాణ వార్త, ఏప్రిల్ 11:- పేద ప్రజల జీవనోపాదులను పెంపోందించేందుకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తత్రంగా తీసుకెళ్లాలని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గo కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె బాలానగర్ పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్బంగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్, డివిజన్ అధ్యక్షులు పార్టీ నాయకులతో నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారంపై ఆమె చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుందని తద్వారా పార్టీ విజయం సులభం అవుతుందని సూచించారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా సునీత కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇన్చార్జి బండి రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం పార్టీని కార్యకర్తలను సమన్వయం చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. భారీ మెజార్టీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.