తాడువాయి గురప్ప వాగు పై ఫార్మేషన్ రోడ్డు వేయించాలి.... కోలా ఆంజనేయులు
మునగాల 01 సెప్టెంబర్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
మునగాల మండల పరిధిలోని మాధవరం చెరువు అలుగు పోస్తుండటంతో మో ద్దుల చెరువు ఎర్ర చెరువు పూర్తిగా అలుగపోసి అవకాశం ఉన్నందున తాడ్వాయి గురప్ప వాగు పై రాకపోకలు బందు అయ్యో అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ముందు జాగ్రత్త తీసుకొని బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన దానికి ఇరువైపులా ఫార్మేషన్ రోడ్డు వేయిస్తే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని మండల బీసీ సంఘం నాయకులు కోల ఆంజనేయులు మీడియా ద్వారా అధికారులకు తెలియజేశారు. సదరు కాంట్రాక్టర్ ఒక సైడు మట్టి పోసి తాత్కాలికంగా రెండవ సైడు మట్టి పోయలేదు కావున అధికారులు స్పందించి తాడువాయి గురప్ప వాగు పై ముందు జాగ్రత్తలు తీసుకోగలరని తెలియపరుస్తున్నాము.