రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అందరూ సద్వినియోగం చేసుకోవాలి

Jan 7, 2025 - 08:19
Jan 7, 2025 - 16:19
 0  4
రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అందరూ సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ వార్త 07.01.2025.సూర్యాపేట జిల్లా ప్రతినిధి:- యశోదా ఆసుపత్రి సోమాజిగూడ ఆద్వర్యంలో నిర్వహించే రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్‌ ఆర్టోపెటిక్‌ రోబోటిక్‌ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ ఆండ్‌ కీ హోల్‌ సర్జన్‌ డాక్టర్‌ సునీల్‌ దాచేపల్లి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రముఖ జాజు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోకాళ్ళ నొప్పుల నివారణకు చేపట్టే మోకాళ్ళ మార్పిడి రోబోటిక్‌ సహాయంతో చేయడం వల్ల ఖచ్చితమైన కొలతలతో విజయవంతంగా సర్జరీ చేయడంతో పాటు తొందరగా కోలుకోవడమే కాకుండ తిరిగి గతంలో మాదిరిగా నడక సులభంగా ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో అదునాతన రోబోటిక్‌ మోకాళ్ళ మార్పిడి చేయడం జరుగుతుందన్నారు.చాలా మంది శాస్త్ర చికిత్సకు భయపడి కేవలం ఇంజక్షన్లను వాడుతున్నారని ప్రస్తుతం టెక్నాలజీ సహాయంతో రోబోటిక్‌ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ చేస్తున్నామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ మేనేజర్‌ పరమేష్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ రాంప్రకాష్‌, శంకరమూర్తి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223