సమగ్ర శిక్షణ ఉద్యోగులు 28వ రోజు నిర్వాదిక సమ్మె.
జోగులాంబ గద్వాల 6 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి. గద్వాల. విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ల సాధన కొరకు తేది 06.01. 2025 . నిరవధిక సమ్మె 28 వ రోజు కొనసాగించడం జరిగింది. 28 వ రోజు సమ్మెలో వినూత్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు స్మృతివనం దగ్గర ధూంధాం ప్రోగ్రాం నిర్వహిస్తూ ధూమ్ దాం ప్రోగ్రాంలో పాటలు పాడుతూ, కబడ్డీ ఆడుతూ సమ్మెను కొనసాగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అప్పటివరకు పే స్కేల్ ను అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన తెలుపడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్ని వింగ్ లకు సంబంధించిన సమగ్ర శిక్ష లోని ఉద్యోగులు ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సమ్మెలో ఈరోజు ధూమ్ ధామ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహిళ సమగ్ర శిక్ష ఉద్యోగులు మరియు పురుష అభ్యర్థులు ధూంధాం ప్రోగ్రాంలో భాగంగా కబడ్డీ ఆడుతూ ఒక టీము రెగ్యులర్ టీము, మరొక టీం పే స్కేల్ టీం అంటూ కబడ్డీ ఆడటం జరిగింది. దీనిలో రెగ్యులర్ టీం గెలవడం జరిగింది. ఇదేవిధంగా సమగ్ర శిక్ష లోని ఉద్యోగస్తులందరూ రెగ్యులర్ చేయాలని నిరసన తెలుపుతూ ధూమ్ ధాం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గట్టు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ గుంటీ గోపిలత గారు, గద్వాల్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్రీదేవి , K.T.దొడ్డి స్పెషల్ ఆఫీసర్ పద్మవతి , కేజీబీవీ ధరూర్ స్పెషల్ ఆఫీసర్ V.T. గోమతి, ఐజా కేజీబీవీ చెన్న బస్సమ్మ, మల్దకల్ కేజీబీవీ స్పెషలాఫీసర్ విజయలక్ష్మి , వడ్డేపల్లి కేజీబీవీ స్పెషలాఫీసర్ పద్మ , రాజోలి కేజీబీవీ స్పెషలాఫీసర్ చంద్రకళ , ఉండవెల్లి స్పెషల్ ఆఫీసర్ పరిమళ , అల్లంపూర్ కేజీబీవీ స్పెషలాఫీసర్ కృష్ణవేణి , మానపాడు కేజీబీవీ స్పెషలాఫీసర్ అనురాధ , ఇటిక్యాల కేజీబీవీ స్పెషలాఫీసర్ ఆసియా బేగం , URS, స్పెషల్ ఆఫీసర్ శేషన్న . సి .ఆర్. టి .లు . పీజీసీఆర్టీలు, మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కొందరు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. DPO వింగ్ అధ్యక్షుడు DLMT. బి రామాంజనేయులు, MIS వింగ్ అధ్యక్షుడు శ్రీధర్, CCO వింగు అధ్యక్షుడు ఆల్తాఫ్, CRP వింగ్ అధ్యక్షుడు ఎంఏ సమీ, IERP వింగ్ అధ్యక్షుడు మురళి గారు, PTI వింగ్ అధ్యక్షుడు రాజేందర్ రోజువారిగ వీరు పాల్గొంటున్నారు.
అదేవిధంగా JAC జిల్లా అధ్యక్షుడు హుషనప్ప ,JAC ప్రధాన కార్యదర్శి గోపాల్ ,KGBV మహిళా అధ్యక్షురాలు SP.ప్రణిత సమగ్ర శిక్ష లోని అన్ని వింగుల అధ్యక్షులు పాల్గొని ఈరోజు నిరవధిక సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.
మా ప్రధాన డిమాండ్
ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గా హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని రెగ్యులర్ చెయ్యాలి. అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయాలి. అని వారు ప్రభుత్వాన్ని కోరారు.