జగ్గయ్యపేట వాసవి క్లబ్ లో నందనవనం ప్రెసిడెంట్గా సతీష్ ను అభినందించిన ఎమ్మెల్యే శ్రీ శ్రీ రామ్ రాజగోపాల్ తాతయ్య గారు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి :- జగ్గయ్యపేట వాసవి క్లబ్ లో నందనవనం ప్రెసిడెంట్ గా సతీష్, ఆనందవనం ప్రెసిడెంట్ గా పబ్బతి జగదీష్, వాసవి కపుల్స్ ప్రెసిడెంట్ గా సన్నే కిరణ్ లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈరోజు శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారిని, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి తాతయ్య గారు, సుబ్బారావు గారు బాధ్యతలు చేపట్టిన వారికి కాలర్ వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పేరూరి వేణు, M. బసవయ్య గుప్తా, పేరూరి నరసింహారావు, తుమ్మేపల్లి చిన్న, దాచేపల్లి శ్రీనివాసరావు, కర్లపాటి కొండ, మద్దుల ఉమామహేశ్వరరావు, రాయపూడి శ్రీకాంత్, చిత్తలూరి చంద్ర శేఖర్, సూరా సతీష్ మరియు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.