మోమితపై అత్యాచారం హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలి

జూనియర్ డాక్టర్ మోమితపై అత్యాచారం మరియు హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలి

Aug 19, 2024 - 19:36
Aug 19, 2024 - 21:19
 0  8
మోమితపై అత్యాచారం  హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలి

జూనియర్ డాక్టర్ మోమితపై అత్యాచారం మరియు

హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలి.

 TPTF సూర్యాపేట జిల్లా శాఖ

 ఆగస్టు 9వ తేదీన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో

జూనియర్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మోమితను తోటి డాక్టర్లు సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి గొంతు నలిమి హత్య చేసారు.ఈ హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ TPTF జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండీ కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీ తీసి సూర్యాపేట కొత్త బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు P. ముత్తయ్య ప్రధాన కార్యదర్శి Ch. బిక్షం. రాష్ట్ర కౌన్సిల్లర్ R ప్రతాప్, R రామనర్సయ్య, T పూలన్ పుప్పాల వీరన్న. పాల్గొని మాట్లాడుతూ 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలొ మహిళలకు, విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయిందని, దేశంలోని ప్రతిరోజు మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు, హింస,దాడులు జరుగుతున్నాయని వీటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందారు అన్నారు. మహిళా రక్షణ కోసం నిర్భయ లాంటి చట్టాలు తీసుకువచ్చినప్పటికీ పునరావతం అవుతూనే ఉన్నాయని అన్నారు.సామ్రజ్య వాద విష సంస్కృతిని, ఆ భావజాలాన్ని అరికట్టాలని అన్నారు. మహిళలపై దాడులను అరికట్టాలి. దేశంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను నిలువరించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని, మహిళలపై హింసను ప్రేరేపిస్తున్న డ్రగ్స్, గంజాయి, మద్యం , పోర్న్ మీడియా వంటి వాటిని నిషేధించి వాటిపై ఉక్కు పాదం మోపాలని జూ.డాక్టర్ హత్యకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని అన్నారు. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే దృష్టి పెట్టడం కాకుండా చిత్తశుద్ధితో శాశ్వత రక్షణ మార్గాలపై దృష్టి పెట్టాలని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పనిచేసే చోట భద్రత కల్పించాలని, స్త్రీలను చిన్న చూపు చూస్తూ, కేవలం లైంగిక పరంగా మాత్రమే చూసే ఆధిపత్య భావజాలాన్ని నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. అప్పుడే కొంత మార్పు తీసాకరాగులుగుతామని అన్నారు. దాడులు చేసిన వారిని భౌతికంగా ఎన్కౌంటర్ చేసిన ఎలాంటి మార్పు రావడం లేదని ఆచరణలో రుజువు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసారు. అన్ని రంగాలలో మహిళలకు రక్షణ కరువైందని, చివరికి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్లకి రక్షణ లేకుండా పోయిందని, మౌనిత మృతిపై సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు...

ఈ కార్యక్రమంలో ముసుకు వెంక ట రెడ్డి, పుప్పాల వీరన్న దుర్గాప్రసాద్, శ్రావణ్, బండారి శ్రీను, జాన్ సుందర్, యాకయ్య, బడుగుల సైదులు, పోతురాజు నరసయ్య, తూము శ్రీనివాస్ , జానయ్య, దబ్బేటి యాదగిరి, శ్యాంసుందర్, చంద్రారెడ్డి, నర్సిరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223