ఆశ వర్కర్లు అరెస్ట్
తిరుమలగిరి 10 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల ఆశ వర్కర్లు చలో అసెంబ్లీ మొట్టడి తరలి వెళ్తున్న ఆశా వర్కర్లను తిరుమలగిరి పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ కార్యకర్తల వేతనాలు ప్రస్తుతం 9000 రూపాయలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా అధికారం రాగానే18000 రూపాయల వేతనంతో పాటు ఈఎస్ఐ,పిఎఫ్,హెల్త్ ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు అమలు చేయలేదని వెంటనే అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడం విడ్డూరమన్నారు. అరెస్ట్ అయిన ఆశ వర్కర్లు విజయ , కలమ్మ, భద్రమ్మ , చైతన్య , స్వరూప, మాధవి, రాధా , ఏకలక్ష్మి , ధనమ్మ విజయ , మహేశ్వరి , వినోద , శారద , శోభారాణి , లక్ష్మి పాల్గొన్నారు...