అందరిలో ఒకడిగా అన్న క్యాంటీన్లో భోజనం చేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట :- అందరిలో ఒకడిగా అన్న క్యాంటీన్ లో భోజనం చేసిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు. జగ్గయ్యపేట పట్టణంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ లో ఈరోజు ఖమ్మం వాస్తవ్యులు లేటు భూక్య నాయుడు గారి (85వ పుట్టినరోజు)జ్ఞాపకార్థం వారి కుమార్తె మరియు అల్లుడుగారు శ్రీమతి డాక్టర్,బి ఎస్ వి పద్మావతి గారు, డాక్టర్,మూడు నారాయణ గారు వారి జ్ఞాపకార్థం శ్రీ వెచ్చ శ్యాము గారి సహకారంతో,ఈరోజు అన్నా క్యాంటీన్ నందు శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారి చేతుల మీదుగా అన్న ప్రసాద వితరణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు ప్రజలతో కలిసి అందరిలో ఒకడిగా భోజనం చేశారు ఈ కార్యక్రమంలో మైనేని రాధాకృష్ణ, శ్రీరాం జయరామ్, వెచ్చ శ్యామ్, బంధం నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.