ట్రాన్స్ కో డైరెక్టర్ జగత్ రెడ్డి కి ఎమ్మెల్యే విజయుడు వినతి

జోగులాంబ గద్వాల 6 జనవరి 2025 తెలంగాణవార్తా ప్రతినిధి.: అలంపూర్ నియోజకవర్గంలో వోల్టేజ్ సమస్య నివారణ కొరకు ఎర్రవల్లి మండల కేంద్రంలో 132/33kv సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజయుడు ట్రాన్స్ కో డైరెక్టర్ జగత్ రెడ్డి ని హైదరాబాదులో కలిసి వినతి పత్రం సమర్పించారు. ★ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ... అలంపూర్ నియోజకవర్గంలోని ప్రజలకు విద్యుత్ సౌకర్యమును మెరుగుపరిచేందుకు,నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు లోవోల్టేజ్ నివారించేందుకు ఎర్రవల్లి మండల కేంద్రంలో 132/33kv నూతన సబ్ స్టేషన్లను మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని కోరారు. ★ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి,నరేందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ అశోక్ రెడ్డి,మహిపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.