రాష్ట్ర స్థాయిలో సేవ పతకాలు రావడం అభినందనీయం:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు

రాష్ట్ర స్థాయిలో సేవ పతకాలు రావడం అభినందనీయం:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల విది నిర్వహణలో ప్రజలకు అందించిన ఉత్తమ సేవలకు గుర్తుగా పోలీస్ అధికారులకు రాష్ట్ర స్థాయిలో సేవ పతకాలు రావడం అభినందనీయం అని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు అన్నారు.నూతన సంవత్సరo ను పురష్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 వ తేదీన ప్రకటించిన సేవ పతకాల కు జిల్లా నుండి ఎంపిక అయిన( హెడ్ కానిస్టేబుల్స్ నారాయణ, రవీందర్ గౌడ్,ప్రభాకర్ రెడ్డి, పురెందర్ మరియు వెంకటస్వామి గౌడ్) అధికారులను మంగళవారం జిల్లా ఎస్పీ తన ఛాంబర్ లో ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీస్ శాఖలో ప్రజల మన్ననలు పొందేలా అధికారులు/ సిబ్బంది చేసిన సేవలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, లభించిన గుర్తింపు తో ప్రజలకు మరింత సేవల అందించేలా కృషి చెయ్యాలని, అలాగే విధి నిర్వహణలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధికారుల సూచనలు పాటిస్తూ ప్రజలకు సేవ చేయడంలో భాద్యతగా తమ వంతు కృషి చేయాలని, అలాంటి సిబ్బందికి ఎప్పటికైనా మంచి గుర్తింప తప్పకుండా లభిస్తుందని అన్నారు.