అడ్డగూడూరు బిజెపి మండల పార్టీ అధ్యక్షులుగా ననుబోతు సైదులు యాదవ్

Mar 7, 2024 - 19:23
Mar 10, 2024 - 03:42
 0  4
అడ్డగూడూరు బిజెపి మండల పార్టీ అధ్యక్షులుగా ననుబోతు సైదులు యాదవ్

అడ్డగూడూరు 07 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదగిరి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన ననుబోతు సైదులు యాదవ్ అడ్డగూడూరు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులుగా నియమితులు కావడం జరిగింది. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షులు సైదులు యాదవ్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులుగా నియమించిన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ కి ,   మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావు,తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య,తుంగతుర్తి కన్వీనర్ కాపు రవి,కూరాకుల వెంకటేశ్వర్లు కి,మాజీ అధ్యక్షులు కడియం సోమన్నకి సీనియర్ నాయకులకు మండల నాయకులకు నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన నాయకులంరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుంన్న బిజెపి పార్టీ కోసం కష్టపడ్డ తనను మండల పార్టీ అధ్యక్షులుగా నియమించడం తనకు ఎంతో గర్వకారణమని ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమైతుందని తెలిపారు.పార్టీ బలోపేతానికి స్వశక్తుల కృషి చేస్తానని అందరి సహకారంతో ముందుకు వెళ్తానని తెలియజేసారు.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో  బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333