వెలిశాలలో గీత కార్మికుడు మృతి
తిరుమలగిరి 26 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన గడ్డం చిన్న వెంకన్న (53) అనే కల్లు గీత కార్మికుడు రోజువారీగా తాడిచెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు మోకుజారి కింద పడటం వల్ల వెన్నుపూస విరిగినది మరియు బర్రింక బొక్కలు రెండు విరిగి లివర్ కు కుచ్చుకపోవటం రక్తం తీవ్రంగా రావడం జరిగింది మరియు కాలుకు చేతులకు నడుములకు బలంగా గుద్దుకోవటం వల్ల శ్వాస ఆడటం లేదని సీరియస్ గా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందడం జరిగింది. కావున ప్రభుత్వం నుండి గీత కార్మికుడికి తక్షణం సహాయము మరియు ఎక్స్ గ్రేషియా 10 లక్షలు ఇవ్వాలని కల్లు గీత కార్మిక సంఘం తిరుమలగిరి మండల కార్యదర్శి చిత్తలూరి సోమయ్య సొసైటీ అధ్యక్షుడు ధూపాటి రాములు మాజీ సొసైటీ అధ్యక్షులు గడ్డం పెద్ద వెంకటయ్య మాజీ సర్పంచి ఆకుల వీరయ్య తదితరులు పాల్గొని డిమాండ్ చేశారు.