ఎవరో ఒకరు

ఎవరో ఒకరు
నూటికో కోటికో
నిత్యం ప్రజలగురించి
తపించే వారు
నిస్వార్ధపరులు
నిజాయితీపరులు
కుటుంబ జీవితానికి దూరంగా
వ్యవస్థలను నిషితంగా పరిశీలిస్తూ,పరిశోదిస్తు
లోపాలను గుర్తిస్తు
పరిస్కారాలను వెతుకుతు
ఆలోచించేవారు ఉంటారు
ఆస్తులను పంచిపెట్టి
ఆంతస్థులను వదులుకొని
పదవులకు దూరంగా
అణగారిన వర్గాలకు అండగా
కనీసవసతులు లేకుండా
కలిసిమెలిసెమనుషులు ఉన్నారు
నిత్యం పోరాటలంటు
ప్రాణత్యాగానికి సిద్ధపడుతు
ప్రజల సమస్యలను
ప్రభుత్వాలకు విన్నవిస్తు
ఆ ఫలితాలను పంచిపెడుతు
ఆనందపడేవారు కొందరు
ఎప్పుడు ఎవరో ఒకరు
పుడుతునే ఉంటారు
భాదలను చూస్తారు
మద్దతుగా నిలుస్తారు
ఏ బంధం లేకున్న కూడా
ప్రజాసంబంధాలే మిన్న అనేవారు
వారి త్యాగలను విలువలను
గుర్తెరిగి స్మరించుకోవాలి
ఈ రకమైన ఆలోచనలను
భావి తరాలకు తెలుపాలి
చరిత్రకు ఎక్కించాలి తద్వారా
కొందరికన్నా కనువిప్పు కలగాలి.
రచన.
కడెం. ధనంజయ
చిత్తలూర్