తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
AP తిరుమల శ్రీవారిని నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న జాన్వీ.. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. TTD అధికారులుఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు