పక్కదారి పడుతున్నఅంగన్వాడి పిల్లల సరుకులు

Dec 11, 2024 - 19:42
Dec 11, 2024 - 20:31
 0  3

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ పక్కదారి పడుతున్నఅంగన్వాడి పిల్లల సరుకులు విధులకు సక్రమంగా రాని అంగన్వాడి టీచర్.. సిపిడిఓ కి పిర్యాదు చేసిన పిల్లల తల్లిదండ్రులు.. సూపర్వైజర్ విచారణ.. మెమో జారీ.. ఆత్మకూరు ఎస్.. ప్రభుత్వం పసిపిల్లల కోసం అంగన్వాడి కేంద్రాల ద్వారా అందజేస్తున్న పోషకాహార సరుకులు పక్కదారి పడుతున్నాయి. స్థానికంగా ఉండకుండా వారానికి రెండు మూడు సార్లు వచ్చి విధులు నిర్వహించే అంగన్వాడీ టీచర్ లు పిల్లలకు చెందిన బియ్యం కోడిగుడ్లను బయటికి అక్రమంగా తీసుకెళ్తున్నారని ఆత్మకూర్ ఎస్ అంగన్వాడీ 3కేంద్రం పిల్లల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం అంగన్వాడి సూపర్వైజర్ అన్నపూర్ణ విచారణ చేపట్టారు. సూపర్ వైజర్ అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో అదనంగా ఉన్న బియ్యం వేరే రూమ్ లో ఉండడం కోడిగుడ్లు దాచిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర కేంద్రాల కు బదులు ఇస్తున్నట్లు చెప్పి బియ్యం పక్కదారికి మల్లిస్తున్నారణీ ఆరోపించారు. విధులకు రాకుండా ఒకే రోజు హాజరు రిజిస్టర్ లో సంతకాలు చేసుకోవడం గుర్తించారు ప్రతిరోజు ఆలస్యంగా వస్తున్నట్లు అప్పుడప్పుడు విధులకు సక్రమంగా రావడం లేదని అంగన్వాడి టీచర్ పై ఆరోపణల చేశారు.అదనంగా ఉన్న 70 కిలోల బియ్యానికి లెక్క చెప్పకపోవడంతో టీచర్ పద్మ కు అంగన్వాడి సూపర్వైజర్ అన్నపూర్ణ మెమో జారీ చేశారు. ప్రతిరోజు ఆలస్యంగా వస్తుందని తల్లిదండ్రులు పిర్యాదు చేయడంతో ఈనెల వారం రోజుల జీతాన్ని కట్ చేస్తానని చెప్పిన సూపర్వైజర్ అన్నపూర్ణ తెలిపారు. పై అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అంగన్వాడి టీచర్లు వ్యవహరిస్తున్నారని స్థానికంగా ఉండకుండా ప్రతిరోజు ఖమ్మం దగ్గర మామిల్లగూడెం నుంచి ఆలస్యంగా వస్తున్న పద్మ వచ్చే నెల నుంచి స్థానికంగా ఉండకపోతే పూర్తి జీతం కట్ చేస్తామని సూపర్వైజర్ అన్నపూర్ణ హెచ్చరించారు.