మానవత్వం చాటుకున్న మల్లీశ్వరి థియేటర్ యజమాని దుర్గ ప్రసాద్

తిరుమలగిరి 02 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలగిరిలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో తిరుమలగిరి మండల కేంద్రంలోని మల్లేశ్వరి థియేటర్ యాజమాన్యం అనంతుల దుర్గాప్రసాద్ వారు ఆర్థిక సాయంతో అల్పాహారం అందించడం జరిగింది ఈ రోజు నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే వరకు ప్రతిరోజు పాఠశాలలోనే 74 మంది పదోతరగతి విద్యార్థులకు సరిపడా అల్పాహారం అందిస్తారని వారు ప్రకటించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామర శ్రీనివాసులు వారికి విద్యార్థులు తరఫున పాఠశాల బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు......