క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట :- జగ్గయ్యపేట నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.జగ్గయ్యపేట పట్టణంలో ఆర్టీసీ డిపో గ్రౌండ్ నందు నూకల రవి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంటును కమిటీ సభ్యులు నిర్వహించారు .కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం టాస్ వేసి మొదటి మ్యాచ్ను ప్రారంభించి క్రీడాకారులతో పరిచయం చేసుకుని కాసేపు సరదాగా క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు శారీరక దృఢత్వం కోసం ఆటలు ఆడాలని సూచించారుఈ కార్యక్రమంలో మైనేని రాధాకృష్ణ, కళ్యాణం కృష్ణారావు, కన్నెబోయిన రామలక్ష్మి, గింజుపల్లి వెంకటరావు,పేరం సైదేశ్వర రావు, షేక్ షాపు మరియు క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.