కుటుంబ ఆత్మహత్యలు 

Jan 8, 2025 - 12:22
Jan 10, 2025 - 16:58
 0  58
కుటుంబ ఆత్మహత్యలు 

కుటుంబ ఆత్మహత్యలు 
రోజు వార్తలలో 
కుటుంబ ఆత్మహత్యలు 
ఉరివేసుకొని, విషయం త్రాగి 
వివిధరకాలుగా ప్రాణాలు వదులుచున్నారు

అప్పులు తీర్చలేమనో 
పిల్లలను సాదలేమనో 
కుటుంబ తగాదాలో 
ఆర్ధికంగా కృంగిపోయో 
కారణాలు ఏమైనా 

ఒక్కరు చేసిన తప్పుకు 
నలుగురు బలవుచున్నారు 
పసిపిల్లలను సైతం 
పక్కలోనే చంపేస్తున్నారు 
కర్కషంగా(కాల్చే )కాటేస్తున్నారు 

మత్తులో కొందరు 
మానవత్వాన్ని మరిచి 
ఆలిని, అమ్మను,అయ్యను 
అన్న తమ్ములు 
ఆలుమొగలు ఒకరికి ఒకరు 
హత్యలు చేసుకుంటున్నారు 
ఆత్మహత్యలకు పాలు పడుచున్నారు 

ప్రేమ విఫలమై 
పెళ్ళికి నిరాకరించినారని 
పెద్దలు ఒప్పుకోలేదనో 
సామజిక కట్టుబాట్లు కావచ్చు 
ప్రాణమీదికి తెస్తున్నాయి 

పుట్టిన ప్రతివారు చనిపోతారు 
జీవించి, సాధించి, సంపాదించి 
పేరు,చదువు,ధనము,ఎదోరూపం
సమయం అయిపోతే 
ఈబంధాలను వదిలిపోక తప్పదు 
ఇది గమనించి బ్రతకాలి 

ఆత్మహత్యలు పరిష్కారం కాదు 
ఆత్మ స్థైర్యం ఉండాలి 
ఆలోచించి అడుగు వేయాలి 
సమస్యను సమాజం ముందు ఉంచాలి, కుటుంబ పెద్దలతో  చర్చించు కోవాలి,తొందరపాటు నిర్ణయాలు సమాజ హితంకారాదని గుర్తించాలి 

ప్రభుత్వాలకు విన్నవించు కోవాలి 
న్యాయస్తానాలు తెలుపాలి 
రక్షణవ్యవస్థతొ మాట్లాడాలి 
కౌన్సిలింగ్ తీసుకోవాలి 
సహాయాన్ని ఆర్జించాలి తద్వారా 
ఆత్మహత్యఅనేఆలోచన పోతుంది
ఈ సమాజం అండగా ఉందని నమ్మకం కలుగుతుంది 

రచన.
కడెం. ధనంజయ 
చిత్తలూర్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333