మీడియా పై దాడికి పాల్పడిన మోహన్ బాబు పై చర్య తీసుకోవాలి

Dec 11, 2024 - 19:40
Dec 11, 2024 - 20:05
 0  1
మీడియా పై దాడికి పాల్పడిన మోహన్ బాబు పై చర్య తీసుకోవాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ మీడియా పై దాడికి పాల్పడిన మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలి రెవిన్యూ కార్యాలయం లో వినతి పత్రం అందజేసిన జర్నలిస్టులు... ఆత్మకూరు ఎస్.. కుటుంబ తగాదాల తో పోలీస్ లకు పిర్యాదు చేసుకొని ఘర్షణ సృష్టించుకున్న సినీ నటుడు మంచు మోహన్ బాబు వార్త కవరేజ్ కి వచ్చిన జర్నలిస్టు ల పై అమానుషంగా దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మండల జర్నలిస్టులు బుధవారం నిరసన తెలిపారు. రెవిన్యూ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో మోహన్ బాబు పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని మరో సారి జర్నలిస్టు ల పై దాడులకు పాల్పడే వారికి గుణపాఠాలు కావాలని కోరారు. అనంతరం రెవిన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు కార్యక్రమం లో జర్నలిస్టు లు భూపతి రాములు జలగం మల్లేష్, సుందర్ సైదులు, తదితరులు పాల్గొన్నారు.