ప్రాణాలు కాపాడిన అర్వపల్లి పోలీసులు

కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ బంధువులకు వీడియో కాల్ చేసిన వ్యక్తి.
డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించిన బందువులు, గ్రామస్తులు.
త్వరితగతిన స్పందించి ఫోన్ లోకేషన్ ద్వారా వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు...
కౌన్సిలింగ్ నిర్వహించి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పంగించిన అర్వపల్లి పోలీస్...
పోలీసు స్పందన, పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపిన బందువులు, స్థానికులు...
అర్వపల్లి 23 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం అడివేముల గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై బందువులకు ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అని తెలుపగా, బందువులు ఈరోజు సాయంత్రం 5 గ గంటలకు డయల్ 100 కు ఫోన్ విషయాన్ని తెలిపినారు. దీనిపై అర్వపల్లి , ఎస్సై త్వరితగతిన స్పందించి ఫొన్ నెట్వర్క్ లొకేషన్ ఆధారంగా పోలీసు సిబ్బంది వారు ఆ వ్యక్తిని గుర్తించి ప్రాణాలతో రక్షించడం జరిగినది. అనంతరం కుటుంబ సభ్యులకు, ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ చేసి పంపించడం జరిగినది. దీనికి గాను త్వరితగతిన స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసుల స్పందన పట్ల, పోలీసు విధుల పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసినారు.....