ప్రభుత్వ పాఠశాలల నిధులకు ఆడిట్

జోగులాంబ గద్వాల 4 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల ఎర్రవల్లి మరియు ఇటిక్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల కు మరియు కస్తూరిబా గాంధీ పాఠశాల మరియు బీచుపల్లి గురుకుల మరియు ఇటిక్యాల గురుకుల పాఠశాలలకు మండల విద్యాశాఖ అధికారులు *జె అమీర్ భాష ఎర్రవల్లి మండలం * మరియు *సి వెంకటేశ్వర్లు ఇటిక్యాల మండలం * సమక్షంలో రెండు మండలాలకు సంబంధించిన మండల విద్యాశాఖ కార్యాలయం కొండేరు నందు అన్ని పాఠశాలలకు *పాఠశాల నిధులపై ఆడిట్ అధికారి వెంకటేష్ ., ఆడిట్ నిర్వహించడం జరిగినది. ఎర్రవల్లి మండలం నందు స్కూల్ మేనేజ్మెంట్ పాఠశాలలు 28 కస్తూర్బా గాంధీ పాఠశాల 1 పీఎం శ్రీ బీచుపల్లి గురుకుల పాఠశాల 1 నిర్వహించడం జరిగినది,. అలాగే ఇటిక్యాల మండలం నందు స్కూలు మేనేజ్మెంట్ పాఠశాలలు 22 పి ఎం శ్రీ గురుకుల ఇటిక్యాల పాఠశాల 1 లకు నిర్వహించడం జరిగినది . ఈ కార్యక్రమంలో రెండు మండలాల ప్రధానోపాధ్యాయులు మరియు ప్రిన్సిపాల్ వారు మరియు మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది కాజా కోఆర్డినేటర్ పాల్గొనడం జరిగినది.