ప్రతి ఇంట ఆనందాల దీపాలు వెలగాలి.
ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి.
నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తెలంగాణవార్త 31.10 2024 సూర్యాపేట జిల్లా ప్రతినిధి వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు.దీపావళి సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరజిల్లాలని ఆకాంక్షించారు.