రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ

హైదరాబాద్ : మాదాపూర్ ఎస్ఐ రంజిత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ రంజిత్‌తో పాటు రైటర్ విక్రమ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని అధికారులు విచారిస్తున్నారు. మాదాపూర్ పీఎస్ సిబ్బంది అవినీతిపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా ఉంచారు. మాదాపూర్ సాయి నగర్‌లో లక్ష్మణ్ నాయక్ ఇంటి నిర్మాణం చేపట్టారు. తన స్థలంలో ఇల్లు కడుతున్నాడని లక్ష్మణ్‌పై సుధా అనే మహిళ ఫిర్యాదు చేసింది. సుధా ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ నాయక్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు రావాలంటూ ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్ కలిసి లక్ష్మణ్‌కు ఫోన్ చేశారు. రూ. లక్ష ఇవ్వాలని లక్ష్మణ్ నాయక్‌ను డిమాండ్ చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వకపోతే లక్ష్మణ్ కూతురు, అల్లుడిపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ బెదిరించాడు. దీంతో ఎస్ఐ, రైటర్‌పై లక్ష్మణ్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం ఎస్ఐ రంజిత్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు