వినాయక హాస్పిటల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

రాoరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

Apr 3, 2025 - 07:33
Apr 3, 2025 - 07:38
 0  6
వినాయక హాస్పిటల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం
వినాయక హాస్పిటల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

సూర్యాపేట, 3 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా కేంద్రం..వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రంను ఏర్పాటు చేయడం అభినందనీయమని టిపిసిసి రాష్ట్ర నాయకులు రాoరెడ్డి సర్వోత్తo రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద వినాయక హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని కలిగి ఉండాలన్నారు. వినాయక హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. వినాయక హాస్పిటల్ మేనేజ్మెంట్ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ అలాగే ముందు ముందు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గత పది సంవత్సరాలుగా వేసవిలో చలివేంద్రంను ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తిని తీరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, ఎలిమినేటి అభినయ్, చంచల నిఖిల్, రాంబాబు, సాయి నేత, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎన్ వి రావు, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ మీనా, మహేష్, రాము, జ్యోతి, సునిత,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333