లైంగిక దాడులపై దైర్యంగా పిర్యాదు చేయండి. మన పిల్లలను రక్షించుకోవడం మన బాధ్యత 

Apr 3, 2025 - 19:18
 0  12
లైంగిక దాడులపై దైర్యంగా పిర్యాదు చేయండి.  మన పిల్లలను రక్షించుకోవడం మన బాధ్యత 
లైంగిక దాడులపై దైర్యంగా పిర్యాదు చేయండి.  మన పిల్లలను రక్షించుకోవడం మన బాధ్యత 

పాఠశాలలు, కళాశాలలో నిత్యం అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలి

బరోసా సెంటర్ అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశం లో --------- జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ ..

జోగులాంబ గద్వాల3 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల్. : వేదింపులు, హత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, బాలలకు  భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజికల్ సపోర్టు  వంటి సేవలు సత్వరమే అందించాలని అలాగే వేదింపులకు గురైన  బాదితులు దైర్యం గా ముందుకు వచ్చి పిర్యాదు చేసేల అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని   జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్   భరోసా లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు. 

  జిల్లా కేంద్రములో  సేవలు అందిస్తున్న బరోసా సెంటర్ యొక్క విధి విధానాలు, లక్ష్యాలు, ఉద్దేశ్యం అంశాలపై జిల్లా ఎస్పీ   ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం లోని  సమావేశ హల్ నందు పోలీస్ అధికారులతో,  బరోసా సెంటర్, అనుబంధ లైన్ డిపార్ట్మెంట్  అధికారులతో, NGOs లతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ మహిళలకు రక్షణగా పిల్లల పై జరిగే లైంగిక దాడుల నివారణ, నిరాదారణకు, దాడులకు గురైన మహిళలకు, బాలలకు అండగా ఉండడమే లక్ష్యంగా జిల్లాలో  బరోసా సెంటర్ సేవలు అందించాలని, 
లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలికలు, బాలలు దైర్యంగా ముందుకు వచ్చి పిర్యాదు చేసేటట్లు ప్రజలకు సంబంధిత శాఖల వారు అవగాహాన కల్పించి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలోప్మెంట్,హాత్యాచారం, బాలలపై లైంగిక వేదింపులు, దాడులు లాంటి కేసులు నమోదు అయినప్పుడు బాధితులను బరోసా సెంటర్ కు వెంటనే పంపించి స్టేట్మెంట్ రికార్డ్ చెయ్యాలని, ప్రతి కేసుకు, పిర్యాదుకు బరోసా ఆన్లైన్ నంబర్ ఇవ్వాలని అన్నారు. అక్కడ మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజికల్ సపోర్టు ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట  బాధితులకు కల్పించడంతో పాటు కేసు ముగిసే వరకు సపోర్ట్ పర్సన్, లీగల్ అడ్వైసర్ అందుబాటులో  ఉంటూ బాధితులకు బరోసా సెంటర్ అండగా ఉండాలనీ  ఎస్పీ  అన్నారు.బాధితులకు నేషనల్ మినరల్ ఫండ్ ద్వారా చదువు, వైద్యం ఇతర అవసరాలను సైతం తీర్చడం జరుగుతోందనీ. స్థానిక హాస్పటల్  సహాయంతో ఇన్ పేషెంట్ విభాగం ను ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుందని అన్నారు.బరోసా లైన్ డిపార్ట్మెంట్స్, NGOs లు సమన్వయంతో పని చేస్తూ బాధితులకు సెల్టర్  సైతం ఇవ్వడం జరుగుతోందనీ అన్నారు.బరోసా సెంటర్, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంగా పని చేయాలని మానవ అక్రమ రవాణా, పిల్లల పై లైంగిక దాడులను నివారించాలని అన్నారు. బరోసా సెంటర్ యొక్క పని తీరు, విధి విధానాలపై అధికారులకు అవగాహన కల్పించడం తో పాటు ఇతర శాఖల వారు బరోసా సెంటర్ కు అదించాల్సిన సపోర్ట్ ను తెలియజేశారు. బాలికల పై భౌతిక దాడులను, హత్యాచారం దాడులను అడ్డుకోవడం లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని చిన్నారులను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు.వేదింపులకు సంభందించి బాదితులు దైర్యంగ పిర్యాదు చేయాలనీ కోరారు.  బరోసా సెంటర్ కు జిల్లా స్థాయిలో అన్ని విభాగాల వారు అనుబంధంగా ఉంటూ సపోర్ట్ అందించాలని అన్నారు.    ఎలొప్ మెంట్ కేసులు జరుగకుండా , వాటి వల్ల జరిగే నష్టాల పై ముందుగానే  ప్రజలకు పిల్లల తల్లిదండ్రులకు, పాఠశాలలు , కళాశాల లో కూడా అన్ని శాఖల వారు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.    భరోసా సెంటర్ నిర్వహణలో పోలీస్ మరియు లైన్ డిపార్ట్మెంట్స్ శాఖల రోల్ ను తెలియజేశారు.
భరోసా సెంటర్ కు సంబంధించి  పొక్సో యాక్ట్ చట్టం లో కేసు నమోదు అయినప్పుడు బరోసా సెంటర్ లో బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు SOP ను అనుసరించి పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో  టెక్నికల్, ఇతర ఏవిడెన్స్ లను కలెక్ట్ చేసి పకడ్బందీ గా చార్జిషీట్ వేయడం ద్వారా నిందితులకు శిక్షా పడేందుకు అవకాశము ఉంటుందనీ అన్నారు.
జిల్లా లో మహిళలలు, బాలికలు మరియు బాలల పై లైంగిక దాడులు  అరికట్టేందుకు  మనమందరం అన్ని శాఖలతో సమన్వయం చేసుకొంటూ బాధ్యతగా పని చేయాలని అధికారులకు సూచించారు. 

ఈ సమావేశంలో డి .ఎస్పి శ్రీ వై మొగులయ్య, ఆలంపూర్, గద్వాల్ , శాంతి నగర్ సిఐ లు రవి బాబు, టంగుటూరి శ్రీను, టాటా బాబు, APP రేచల్ సంజన , DWO సునంద, CWC ఛైర్ పర్సన్ సహా దేవుడు, భరోసా ఇంచార్జి ఎస్సై స్వాతి, CWC మెంబర్ శైలజ, DCPO నరసింహ, LCPO శివయ్య, RMO వృశాలి, NGOs సాయి కుమార్, గిరిబాబు, సఖి సెంటరు ఇంచార్జి శోభ , భరోసా కో ఆర్డినేటర్ శివాని, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, ప్రొబేషనరీ ఎస్సై లు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333