అడ్డగుడూరు మండల సిపిఎం పార్టీ కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ అక్రమ అరెస్టు
అడ్డగూడూరు 01 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
మంగళవారం రోజు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక పోలీసుల సీపీఎం అడ్డగుడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ ని అరెస్ట్ చేసి అడ్డగుడూరు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.ఈ సందర్భంగా బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ..నిర్భందాలతో, నిరసనలను పోరాటలను అపాలనుకోవడం ప్రజాస్వామ్యంలో ఇది ప్రజా పాలన కాదని,నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్ని అన్నారు.సెంట్రల్ యూనివర్ సిటీ భూమి అమ్మకాని నిరసిస్తూ,విశ్వవిద్యాలయాలను విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇందుకు విరుద్ధంగా హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్ సిటీకి సంబందించిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మకానికి పెట్టె ప్రయత్నం విరమించుకోవాలని,ఆ భూమిని యూనివర్ సిటీ అభివృద్ధికి ఉపయోగించాలని కోరుతూ, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిరసనకు పిలుపు నిచ్చారని తెలిపారు.వెళ్లకుండా ఎక్కడి వారిని అక్కడ అరెస్టు చేసి, నిర్భదించటం అన్యాయమని, ఎన్నికల ముందు ప్రజాస్వామ్య పునరుద్దరణ తన ఏడో గ్యారెంటిగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం,ఇంత అప్రజాస్వామికంగా అరెస్టులతో, నిర్భందాలతో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఇప్పటికైనా ఆ భూమి వేలం పాట ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.