చెన్నకేశవ స్వామికి పంచామృత అభిషేకం

సూర్యాపేట రూరల్ (పిల్లలమర్రి): మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు గురువారం రోహిణి నక్షత్ర సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై రఘువరన్ ఆచార్యులు స్వామివారికి పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించి తదుపరి వస్త్రాలంకరణ చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.అర్చకులు మాట్లాడుతూ...ప్రతి నెల రోహిణి నక్షత్రం రోజున పంచామృత అభిషేకం నిర్వహిస్తామని చెన్నకేశవ స్వామి వారు బావిలో వెలసినారు కాబట్టి ఇక్కడ స్వామికి అభిషేకం ఎంతో ప్రీతి అన్నారు.ప్రతి నెల రెండవ శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సహిత ఊంజల్ సేవ,పౌర్ణమి ముందు వచ్చే శుక్ల పక్ష ఏకాదశి రోజున స్వామి వారి మాస కళ్యాణం ,ప్రతి శుక్రవారం పుష్పాలంకరణ సేవ,నెలలో 3వ ఆదివారం మూల మంత్ర హోమం నిర్వహించి భక్తులకు స్వామి వారి మంగళా శాసనములు భక్తులకు అందిస్తున్నాం అన్నారు.. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ గుకంటి రాజబాబు రెడ్డి, అంకం భిక్షం , మహిళా భక్తులు ముడుంభై సారిక,మల్లీశ్వరి,సువర్ణ,అహల్య, విజయ లక్ష్మీ,తదితరులు పాల్గొన్నారు.