జిల్లాలో 1000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ....
రాష్ట్ర ప్రభుత్వం గా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని జిల్లాలో మంగళవారం ఘనంగా ప్రారంభించారు.గత నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హుజూర్నగర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందె. మంగళవారం జిల్లా వ్యాప్తంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు మందుల శామ్యూల్, కోదాడ నియోజకవర్గంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ వి.రాజారావు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్పహాడ్ వద్ద సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పథకాన్ని ప్రారంభించారు.సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 610 రేషన్ షాపులకు గాను మంగళవారం నాడు 585 రేషన్ షాపులలో 51,000 మంది రేషన్ కార్డు దారులకు1000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తొలిరోజు పంపిణీ చేశారని జిల్లా అధికారి డియస్ఓ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగాజిల్లా లోని మొత్తం
రేషన్ షాప్స్ ల లో 610 రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనునిత్యం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని రేషన్ షాపుల పరిధిలో గల అంత్యోదయ, అన్నపూర్ణ, ఎఫ్ ఎస్ సి లబ్దిదారుల కూడ ఈ పథకం ద్వారా జిల్లా ప్రజానీకానికి లబ్ధి చేకూరుతుందని డిఎస్ఓ రాజేశ్వరరావు.