రెండు రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న నమస్తే తెలంగాణ ఫోటోగ్రాఫర్ సైదిరెడ్డి

రెండు రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న
నమస్తే తెలంగాణ ఫోటోగ్రాఫర్ సైదిరెడ్డి
గృహజ్యోతికి రాష్ట్రస్థాయి మొదటి అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం
చేస్తూ సైదిరెడ్డిని అభినందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
కుటుంబ సమేతంగా అవార్డులతో పాటు నగదు
ప్రోత్సాహకాన్ని అందుకున్న సైదిరెడ్డి.
తెలంగాణవార్త 19-08-2024 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:- ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో సూర్యాపేట జిల్లా నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ పి. సైదిరెడ్డి సోమవారం హైదరాబాదులోని గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు చేతులమీదుగా అందుకున్నారు.* ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో సూర్యాపేట జిల్లా నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ నాలుగవ కేటగిరిలో గృహాజ్యోతి పథకానికి సంబంధించిన చిత్రానికి మొదటి అవార్డు రాగా, మొదటి కేటగిరీలో మహాలక్ష్మి పథకంపై తీసిన చిత్రానికి ప్రోత్సాహక బహుమతి అందుకున్నారు. *ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకానికి సంబంధించి జర్నలిస్టు సైదిరెడ్డి తీసిన చిత్రం ఉత్తమ చిత్రంగా మొదటి అవార్డు గెలుచుకోవడం అభినందనీయమన్నారు.* అలాగే మరో పథకం మహాలక్ష్మి పథకం కు ఫోటో జర్నలిస్టు పి. సైదిరెడ్డి ప్రోత్సాహక బహుమతి అందుకోవడం గర్వనీయమన్నారు. *ఫోటో జర్నలిస్టు సైదిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఫోటో కాంపిటీషన్లో ప్రతి ఏటా అవార్డులు అందుకోవడం సైదిరెడ్డి వృత్తి నిబద్ధతకు నిదర్శనం అన్నారు.* ఫోటో జర్నలిస్టులు కేవలం సమస్యలపైనే కాకుండా ప్రభుత్వ పథకాలపై కూడా ఇలా ప్రజల్లో అవగాహన కల్పించడం ఆనందంగా ఉందన్నారు. *ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున రాష్ట్రస్థాయి రెండు అవార్డులు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు*. 30 ఏళ్ల ఫోటో జర్నలిస్టు జీవితంలో ప్రభుత్వపరంగా ఎన్నో అవార్డులు అందుకోవడమే కాకుండా ఫోటో జర్నలిస్ట్ సంఘాలు, ఇతర సంస్థలు నిర్వహించే పోటీల్లో కూడాఎన్నో అవార్డులు రావడం సంతోషం అన్నారు. ఈ అవార్డును కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవడంచాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రావడం పట్ల నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.