చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి సిపిఐ పార్టీ

May 9, 2024 - 19:51
May 9, 2024 - 20:31
 0  86
చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి సిపిఐ పార్టీ

 తిరుమలగిరి పది మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి శ్యామలకిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తినియోజకవర్గం ఇంచార్జ్ ఎల్లముల యాదగిరి అన్నారు. గురువారం రోజు తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి సిపిఐ నాయకులు పాల్వాయి పున్నయ్య అధ్యక్షత వహించగా ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ ఎల్లముల యాదగిరి మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో మోడీ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలకు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. సిపిఐ బలపరుస్తున్న ఇండియా కూటమి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజర్ జి రాజారాo, సిపిఐ మండల నాయకులు కోట రామస్వామి, కనుక అశోక్,సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034