ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Oct 2, 2024 - 21:32
Oct 2, 2024 - 22:06
 0  6
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

టీఎన్జీవో భవనంలో నివాళులు అర్పించిన గడియారం శ్రీహరి

మంచిర్యాల, 02 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు పునస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని, ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య అసోసియేట్ అద్యక్షులు శ్రీపతి బాపు రావు కోశాధికారి ఏ సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు కేజియా రాణి, శ్రీనివాస్,రామ్ కుమార్ , తిరుపతి, అంజయ్య సంయుక్త కార్యదర్శిలు సునీత,పద్మలత ప్రభు, వెంకటకృష్ణ పబ్లిసిటీ సెక్రటరీ యూసఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ కార్యదర్శి అజయ్ మందమర్రి యూనిట్ అద్యక్షులు సుమన్ బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ , లక్షెట్టిపేట కార్యదర్శి వేణు,జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్, కుమార్,సంజీవ్, ప్రణవానంద్, రాజలింగు,తదితరులు పాల్గొన్నారు.

Pilli Ravikiran Mancherial Staff Reporter