ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించండి*

Aug 25, 2024 - 18:03
Aug 25, 2024 - 22:15
 0  6
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించండి*

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించండి

ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్

మంచిర్యాల, ఆగస్టు 25 (తెలంగాణవార్త): - తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయుల ఐకాస చైర్మన్ టిఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ మంచిర్యాల జిల్లాకు విచ్చేసిన సందర్భంగా టీఎన్జీవో భవన్ లో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల కు ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏ లను ప్రకటించాలని, సీపీస్ ను తొలగించి పాత పెన్షన్ విధానం ఒపీస్ ను అమలు చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన పిఆర్సి ని శాతం తో వెంటనే సమకూర్చాలి. పెండింగ్ లో ఉన్న బిల్లును వెంటనే చెల్లించాలని, 317 జీవో వలన నష్టపోయిన ఉద్యోగులకు వారి స్థానిక జిల్లాలకు పంపాలని, సెప్టెంబర్ ఒకటో తేదీన అన్ని జిల్లా మండల కేంద్రాలలో అందరూ ఉద్యోగ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విద్రోహ దినముగా పాటించాలని, ఇటీవల జరిగిన బదిలీలలో మిగిలిపోయిన స్పౌస్ ఇతర ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

  అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ స్టీరింగ్ కమిటీతో ప్రభుత్వం సానుకూల వాతావరణం లో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు . ఈ సమావేశంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్, పిఆర్టియు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఇన్నారెడ్డి టిఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య మంచిర్యాల జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు కోశాధికారి ఏ సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు కేజియా రాణి, శ్రీనివాస్,రామ్ కుమార్,తిరుపతి, అంజయ్య సంయుక్త కార్యదర్శిలు సునీత,పద్మలత ప్రభు, వెంకటకృష్ణ పబ్లిసిటీ సెక్రటరీ యూసఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ కార్యదర్శి అజయ్ మందమర్రి యూనిట్ అద్యక్షులు సుమన్ బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్,కుమార్,సంజీవ్, ప్రణవానంద్,తదితరులు పాల్గొన్నారు.

Pilli Ravikiran Mancherial Staff Reporter