క్యాన్సర్ తో బాధపడుతున్న కుటుంబాన్ని ఆర్థిక సహాయం
ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు.
జోగులాంబ గద్వాల7 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఎర్రవల్లి. మండలకేంద్రంలో బీచుపల్లి గ్రామపంచాయతీ లో నేడు సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత మూడు నెలల నుండి లివర్ క్యాన్సర్ తో బాధపడుతు అనేక సోషల్ మీడియాలో కూడా అతని ఆరోగ్య పరిస్థితిల గురించి వచ్చాయి పూడూరు గ్రామానికి చెందిన మాధవయ్య శెట్టి ప్రస్తుతం అతను అత్తగారి ఇంటిలో బీచుపల్లి లో నివాసం ఉంటున్నారు ట్రీట్మెంట్ కొరకే చాలా ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పారని అంత ఖర్చు పెట్టే స్తోమత మాకులేదని సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యత మన స్వచ్ఛంద సంస్థ వారికి తెలియజేయడం జరిగినది.
గత ఐదు సంవత్సరాల నుండి అశోక్ ఆలోచన మేరకు వారిసూచన లతో ఈ సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు చదువుపరంగా ,కానీ హెల్త్ ప్రాబ్లం ఉన్న, కానీ బీద కుటుంబాలు పెళ్లి చేయడానికి ఇబ్బంది ఉన్న ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న వారితో ఆశ్రయించిన వారికి మేమున్నాము అంటూ వారికి చేతనైనంత సహాయం చేస్తూ అన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగస్తులు ప్రైవేటు ఉద్యోగస్తులు సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుని కలుపుకొని వారు స్వచ్ఛందంగా ఎంత పనులు ఉన్న ప్రతి నెలలో ఎవరికో ఒకరికి ఏదో ఒక కుటుంబానికి వారికి తోచినంత సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు అదే క్రమంలోని మాధవయ్య శెట్టి కి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కుదుటపడాలని వారి యొక్క సమస్త సభ్యులందరూ మానవత్వంతో చెప్పిన 15 రోజులలోనే వారి కుటుంబానికి 48 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది వారి కుటుంబ సభ్యులందరూ వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది అదే కాకుండా ఇందులో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ వారుఎలాంటి సందర్భంలోనైనా మీకు ఇబ్బంది కలిగితే మాకుకాల్ చేస్తే ఉచిత ట్రీట్మెంట్ ఏర్పాటు చేస్తామని శ్యాంసుందర్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అశోక్, టీవీఎస్ షోరూం మల్లేష్ , నరసింహ, నరేష్ ఆగస్టు వెంకట్రాముడు బెంజ వేణు జయన్న మురళి ఈశ్వర్, నాగేష్, ఉదయ్, సలీం, రామన్న, మహేష్, రాజు, టీచర్ మహేష్, శ్యాంసుందర్ హెల్త్ డిపార్ట్మెంట్ తదితరులు పాల్గొనడం జరిగింది.