కాంటాక్ట్ కార్మికుల ఆరోగ్యాలకు సేఫ్టీ ఏది?

Sep 9, 2024 - 21:41
Sep 9, 2024 - 21:42
 0  1
కాంటాక్ట్ కార్మికుల ఆరోగ్యాలకు సేఫ్టీ ఏది?

- వర్షంలో కూడా విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు

- కార్మికుల సేఫ్టీని పట్టించుకోని సివిల్ అధికారులు 

- సీఐటీయూ కాంటాక్ట్ కార్మికుల అధ్యక్షుడు దూలం శ్రీనివాస్

రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 09 (తెలంగాణవార్త):- మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ ఏరియా సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు సివిక్ కార్మికులు వర్షాలను సైతం లెక్కచేయకుండా అధికారుల, కార్మికుల కాలనీలను నిత్యం పారిశుద్ధ్య పనులను చేస్తు, అధికారుల, కార్మికుల వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ కాంట్రాక్టు కార్మికుల ఆరోగ్యాలను కాపాడటంలో, వారికి సెప్టీ కల్పించడంలో సివిల్ అధికారులు మాత్రం సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా కార్మికులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చి, సింగరేణి ఏరియా ఆసుపత్రికి వెళ్లితే, కనీసం పట్టించుకోని చిన్న గోలిమందు ఇచ్చే పరిస్థితిలు కూడా లేవు. ఇలాంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొని పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సేఫ్టీ విషయంలో కూడా సివిల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కార్మికులు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికుల సేఫ్టీ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సీఐటీయూ డిమాండ్ చేశారు.

Pilli Ravikiran Mancherial Staff Reporter