ఇసుక కృతిమ కొరత సృష్టిస్తూ కోట్లు కోళ్లగొడుతున్న ఇసుకసూరులు

Jul 5, 2024 - 13:51
 0  29
ఇసుక కృతిమ కొరత సృష్టిస్తూ కోట్లు కోళ్లగొడుతున్న ఇసుకసూరులు

జోగులాంబ గద్వాల 5 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లా వ్యాపాతంగా ఇసుకసూరులు రెచ్చిపోతున్నారు. నూతన నిర్మాణాలు చేపట్టే యజమానులను సైతం టార్గెట్ చేస్తూ కృతిమ కొరత సృష్టిస్తూ 18 ఇంచుల బాడీకీ బదులు 6 ఇంచుల ట్రాక్టర్ ద్వారా ఫిల్టర్ ఇసుక, అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలించి వారికి సంబంధించిన వ్యక్తుల గృహాలు దగ్గర డంపు చేసి అక్కడి నుండి నిర్మాణం చేపట్టే వ్యక్తులను టార్గెట్ చేసుకొని 6 వేలు వసూళ్లు చేస్తున్నారు.ప్రభుత్వం మన ఇసుక మన వాహనం పేరున 18 ఇంచుల బాడితో 6 వెలకే వేస్తుండగా అందులో 1500 రూ. ప్రభుత్వనికి చెల్లెస్తూ ట్రాక్టర్ యజమానికీ 4 వేల రూపాయలు ఇస్తున్నారు. అదే ఇసుకను 6 ఇంచుల బాడీలతో ఈ రకంగా వసూళ్ల చేయడంలో సంగల గ్రామానికి చెందిన వ్యక్తులు అరితేరారు. అక్రమ దందే ధ్యేయంగా పలు పార్టీలు మారుతూ కాలం వెళ్ళతీయడంలో ఆ గ్రామానికి చెందిన వ్యక్తులు ఘనులు,ఏకంగా కొందరు ట్రాక్టర్ స్థాయి నుండీ టిప్పర్ల స్థాయికి ఎదిగితే కొందరు ముఖ్య నాయకులు టిప్పర్ల ను టార్గెట్ చేసుకొని నేలకు లక్షల్లో టిప్పర్ల యజమానుల నుండి వసూళ్లు చేస్తూ ఆయా శాఖల అధికారులను సైలెంట్ చేసే పనిలో కొందరు నాయకులు వ్యవహరించడం శోచనీయం,సామాన్యనికి అందని ద్రాక్షగా ఇసుకను కొరత సృష్టించడంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు ముందుకు వెళ్లడం బాధాకరమన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333