డీ జే ల కు ఎలాంటి అనుమతి లేదు సూర్యాపేట సిఐ జి. రాజశేఖర్.
*డిజెలకు అనుమతి లేదు*
సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ ఉత్తర్వుల మేరకు సూర్యాపేట టౌన్ సిఐ జి రాజశేఖర్ డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులకు డీజే సౌండ్ సిస్టం ఓనర్లనుసోమవారము పట్టణ పోలిస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చి ఎట్టి పరిస్థితిలో డీజే అనుమతులు ఇవ్వడం జరగదు డీజే సౌండ్ సిస్టం పై నిషేధం అని తెలియపరచనైనది. గణేష్ మండపాల వద్ద గాని, నిమజ్జనం ఊరేగింపుల్లో గాని డీజే సౌండ్ సిస్టం లను పెట్టి కిరాయికి ఇచ్చి, ఇట్టి నియమాలు అతిక్రమించి ఎవరైనా డీజే సిస్టం పెట్టినచో వారిపై కేసు నమోదు చేసి డీజే సిస్టం సీజ్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును అని తెలియ చేయనైనది అని వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. తదుపరి వారిని సూర్యాపేట తాసిల్దార్ ముందు బైండోవర్ చేయడం అయింది...
ఇట్లు జి రాజశేఖర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్