అన్ని దానాల కన్నా.. అన్నదానం మిన్న..

మరిపెడ 01 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో మూడో వాడ్డు సీతారాంపురం కాలనీలో బాలవికాస పరిధిలో 6వ రోజు వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గణేశుడికి వేద మంత్రాలతో సాక్షిగా ఆ ఏకదంతుని కరుణాకటాక్షాలు భక్తులపై చల్లని చూపులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. కుటుంబం పై ఉండాలని. నవరాత్రి ఉత్సవాలను ఇలాంటి విగ్నాలు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పూజలు జరగాలని అలాగే మంచి వర్షాలు కురుస్తున్న ఈ శుభ సందర్భంలో పచ్చని పాడిపంటలతో ప్రతి రైతు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో వియక ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.