ఉత్తనూరు గ్రామ దళితులను అణిచివేసి

Feb 28, 2026 - 19:42
 0  2

ఇబ్బందులకు గురి చేస్తూ దళితులకు  ఉపాధి లేకుండా చేయాలనీ రెడ్డీలు చేస్తున్నా  కుట్రలు  సహించేది లేదు


 భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్


 జోగులాంబ గద్వాల 28 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అయిజ. మండలం,ఉత్తనూరు గ్రామం లో నిరుపేద దళితులు రాజు, భాస్కర్ కుటుంబం  గ్రామ శివారులో మట్టి ఇటుకల బట్టి పనులు చేసుకుని జీవనోపాధి కలిగి ఉన్న దళితులను ఈ రోజు నిరుపేద దళితులను అదే గ్రామానికి చెందిన రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు వారి అనుచరులు వారికి ఉపాధి లేకుండా చేయాలని కుట్ర చేస్తూ వారు ఇటుకలు పని చేస్తుండగా వచ్చి భయబ్రాంతులకు, ఇబ్బందులకు గురి చేయడన్ని తీవ్రంగా కండించి జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని  భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ అన్నారు, గ్రామంలో దళితులను చెప్పు చేతల్లో ఉండాలని భయభ్రాంతులకు గురి చేయడం అణిచివేయడం దాడులు చేయడము చంపుతామని బెదిరించడం ఇవన్నీ రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు చేయడము తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు, దళితులను వారి పనులను అడ్డగించి ఉపాధి లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో బాధితులు రాజు భాస్కర్ వారి కుటుంబం తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333