ఘనంగా ప్రారంభమైన మండల స్థాయి SGF క్రీడోత్సవాలు

Sep 2, 2025 - 17:36
Sep 2, 2025 - 18:43
 0  122
ఘనంగా ప్రారంభమైన మండల స్థాయి SGF  క్రీడోత్సవాలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : ఘనంగా ప్రారంభమైన మండల స్థాయి SGF క్రీడోత్సవాలు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏపూరు నందు ఆత్మకూరు ఎస్ మండల స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడాత్సవాలు ఘనంగా ప్రారంభమై ఈ క్రీడల్లో మండలంలోని దాదాపు అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ క్రీడలని మండల విద్యాధికారి పి ధారా సింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జాటోత్ జాన్ గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పిల్లల్లో క్రీడా నైపుణ్యాలను పెంచడానికి వారిలో దాగి ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడంలో భాగంగానే ప్రతి మండలంలో మండల స్థాయిలో క్రీడలు నిర్వహిస్తారని ఆ తర్వాత జిల్లా స్థాయి గేమ్స్ కి విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు . ప్రారంభోత్సవ సమయంలో వివిధ పాఠశాలల విద్యార్థులు మార్చి పాస్ట్ నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ క్రీడల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, కోకో విభాగాల్లో బాలికలకు బాలురకు వేరువేరుగా అండర్ 17 విభాగంలో క్రీడల్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇవి ఈరోజు రేపు రెండు రోజులు నిర్వహించబడతాయి. ఈ పోటీలలో పాల్గొని మంచి నైపుణ్యం ప్రదర్శించినటువంటి విద్యార్థిని విద్యార్థులను మండల నుంచి జిల్లాకి సెలెక్ట్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. దీనిలో 12 పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. రేపు అండర్ 14 విభాగంలో క్రీడలు నిర్వహించబడతాయి.ఈ కార్యక్రమంలో పాతర్లపాడు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటయ్య ఆత్మకూరు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ పిజేఎఫ్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సులోచన గారు అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గంగ అలాగే వివిధ పాఠశాలల యొక్క వ్యాయామ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మొదలైన వారు పాల్గొన్నారు